"లచ్చ కోట్లు.. కాదు..కాదు.. 14లచ్చల కోట్లు.. మొత్తం దోచేశారంట..గనులు..నీల్లు..స్థలాలు.. అసలు ఈ తండ్రీ కొడుకుల దోపిడీకి గురికాని ఊరే రాష్ట్రంలో లేదంట" అని ఈనాడు, ఆంధ్రజ్యోతి.. గతకొన్ని రోజులుగా  ప్రత్యేక కథనాలు,విశ్లేషనలూ, టేబుల్లు,గ్రాఫులూ, గ్రాఫిక్సులూ..
ఇక అవినీతిపై యుద్ధమంటూ.. అన్నాహజారే, బాబా రాందేవ్ ల జపం చేసుకుంటూ తామే పెద్ద సర్టిఫైడ్ దేశభక్తుల్లా ఫోజుకొడుతూ.. జగన్ అరెస్టుపై, అతని కుటుంబ సభ్యులపై  రోజూ సటైర్లు, కార్టూన్లతో వివిధ బ్లాగుల్లోనూ, ఫేస్ బుక్ లాంటి సోషల్ వెబ్సైట్లలోనూ తెగ హడావుడి చేసే నయా జమానా నెటిజన్లు..  ఇలాంటి వారందరికీ ఈ రోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు చూసి పాపం మైండ్ బ్లాంక్  ఐఉంటుందనటంలో సందేహం లేదు.  

ఇక తెలంగాణా తమ సొంత జాగీరులా భావిస్తూ, వేరెవరికీ అక్కడ డిపాజిట్లు కూడా దక్కవని ఇన్నాల్లూ బీరాలు పలికిన కచరా & కో లకు గంటా సురేఖ నిజంగానే చుక్కలు చూపించింది.వారి అదృష్టం బాగుండి, చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా బొటాబొటి మెజారిటీతో గెలిచారు కాబట్టి సరిపోఇంది కానీ లేకుంటే ఒకప్పుడు అసెంబ్లీలో YSR చెప్పినట్లుగా 'వారికి తలెక్కడపెట్టుకోవాలో కూడా తెలీని పరిస్తితి వచ్చేది.'

మొత్తం మీద ఈ ఉప ఎన్నికల ఫలితాలు కొన్ని విషయాల్ని మాత్రం తేటతెల్లం చేశాయి.. 
1. ప్రజలకు నిజంగానే మేలు చేసిన నాయకున్ని ప్రజలెప్పటికీ అంత ఈజీగా మరచిపోరు.. పైగా అతనిలోని లోపాల్ని కూడా చూసీ చూడనట్లు వదిలేస్తారు. YSR ప్రవేశ పెట్టిన పథకాలైన ఆరోగ్యశ్రీ,108,104,ఇందిరమ్మ,ఫీజుమాఫీ, మైనారిటీ రిజర్వేషన్లు, పావలావడ్డీ  లాంటి పధకాల లబ్ధిదారులకి అతని అవినీతి, జగన్ అక్రమాస్తులు అనేవి  ఎన్నికల అంశం కాదు..  పైగా ఇతర ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,తెదెపా లలో కూడా అవినీతి ఉందనేది అందరికీ తెలిసిందే కాబట్టి, ప్రజలకి  వేరే ప్రత్యామ్నాయం కూడాలేదు. 
2.ఇక అవినీతి, సచ్చీలత లాంటి వాటి గురించి బ్లాగుల్లోనూ, వివిధ వేదికల మీద ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చేవారెవరూ, ఎన్నికల్లో క్యూలో నిలబడి ఓట్లేసే రకాలు కాదు. పైగా తమను తాము మేధావులుగా  ఊహించుకోవడం వల్ల.. ఇతర సామాన్య జనంతో వీరు కలవరు.. కాబట్టి వారి ఆలోచనలేంటో ఈ మేతావులకి  తెలిసే అవకాశంకూడా లేదు. దానితో తీరా ఇలాంటి ఫలితాలొచ్చాక అవాక్కైపోయి,  ప్రజలు మంచోల్లు కాదనీ, ఓట్లను అమ్ముకున్నారనీ నిందిస్తూ తమ అక్కసును వెల్లబోసుకుంటుంటారు. 

Source: http://andamainacheekati.blogspot.in/2012/06/blog-post.html


ఉపఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పి ఘన విజయం ఒక ఎత్తైతే -తిరుపతి -ఆళ్ళగడ్డ విజయం బోనస్ వంటిది. పిల్లి సుబాష్ చంద్రబోస్ ఓటమికన్నా సురేఖమ్మ అపజయం (పదాల్లో తేడా చూడండి) ఇంకా మింగుడు పడటం లేదు. నెల్లూరు పార్లెమంటరి ఎన్నికల్లో విజయం సోనియాకు చంపె పెట్టు. తిరుపతిలో చిరంజీవికన్నా 3000+ మెజారిటి సాధించడం గొప్పే. ఇదిలా ఉంటే వై.ఎస్.ఆర్ .సి. పి వెను వెంటనే మరో సమరానికి సిద్దం కావల్సి ఉంది. అదే రాష్ఠ్ర్రపతి ఎన్నికలు.

గతంలో ఒక రాష్ఠ్ర్రపతి ఎన్నికలతో కాంగ్రెస్ ఇందిరా ఫ్యేమిలి గుప్పిట్లోకి వెళ్ళి పోయింది (కాంగ్ర్స్ సీనియర్ నాయకుల్ని కాదని వి.వి.గిరిని ఇందిర గెలిపించుకోవడంతో)

ఈ రా.ఎన్నికల్లో సోనియా అభ్యర్ధి అయిన ప్రణబ్ ముకర్జిని ఓడించ కలిగితే ఈ దెబ్బకి కాంగ్రెస్ ఇందిరా ఫ్యేమిలి చేతులనుండి పూర్తిగా భయిటపడినట్టే.

ఈ టార్గెట్టును రీచ్ అవ్వాలంటే విజయమ్మ,షర్మిల తరం కాదు. యు.పి.ఏ ,ఎన్.డి.ఏ కూటమి పార్టిలతో సంబంధం లేకుండా పై కూటముల్లో ఉన్న అసమ్మతి వర్గాలను ఏకతాటి పై నడిపింఛాలి అంటే అది ఒక్క జగన్ మాత్రమే చెయ్యగలరు.

కాబట్టి ఈ క్షణం నుండి జగన్ను జైల్లోనుండి భయిటకు తేవడమే ప్రప్రథమ కర్తవ్యం. వెంటనే వై.ఎస్.ఆర్.సి.పి ప్లీనరి సమావేశం ఏర్పాటు చేసి జగన్ విడుదలకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. దానికి అనుగుణంగా క్యేడరు మొత్తం పని చెయ్యాలి.

అలాగే ఆ లోపు ఈ విషయమై ( రా.ఎన్నికలు) జాతీయ /ప్రాంతీయ పార్టీలతో చర్చలు సంప్రదింపులు జరపడానికి ఒక చిన్న పాటి కమిటిని వేసుకుని ఆ కమిటి వెనువెంటనే టూర్ మొదలు పెట్టాలి. జగన్ విడుదలై వచ్చేంత వరకు జగన్ అందించే బ్లూ ప్రింటుతో చర్చలు సంప్రదింపులు చెయ్యాలి. కృషి ఫలించి జగన్ విడుదలైతే ఆ పనేదో జగన్ చేసుకు పోతారు. కమిటి అతనికి చేదోడు వాదోడుగా ఉంటే సరిపోతుంది.

ఆరు నూరైనా నూరు ఆరైనా సోనియా ప్రతిపాదించే అభ్యర్దిని ఓడించి తీరాలి. ఇది సాధ్యమైతే యు.పి.ఏ ప్రభుత్వం కూలడం -ఆటోమెటిగ్గా ఇక్కడి తొట్టి సర్కారు మట్టి కొట్టుకు పోవడం ఖాయం.


Jagan Illegal Arrest
ప్రస్తుత పరిస్థితులే 2014 దాక కొనసాగి, తెలంగాణ ఏర్పాటు గానీ, మధ్యంతర ఎన్నికలు గానీ రాకపోయినట్లయితే 2014 ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో ఎలా ఉండవచ్చు? ఇదీ నా అంచనా.

తెలంగాణ
----------
టీఆరెస్ - 35
వైఎస్సార్ కాంగ్రేస్ - 20
బీజేపీ - 15
సీపీఐ+సీపీయం - 12
టీడీపీ - 10
మజ్లీస్ -  2
కాంగ్రేస్ - 14
ఇతరులు -  2

మొత్తం - 112

ఆంధ్ర
-------

టీడీపీ - 35
కాంగ్రేస్ -  54
వైఎస్సార్ కాంగ్రేస్ - 90
సీపీఎం - 2
ఇతరులు -  3

మొత్తం - 184


బహుషా కాంగ్రేస్ పార్టీ వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీకి మద్దతు ఇచ్చి జగన్ను ముఖ్యమంత్రిని చెయొచ్చు. మెల్లిగా జగన్ కాంగ్రేస్లో కలిసిపోవచ్చు.

కేంద్రంలో ఇప్పుడున్న పరిస్థితిలో అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రేస్ మల్లీ అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యం. బీజేపీ అధికారంలోకి వచ్చినపక్షంలో 2015లోపు రాష్ట్రం విడిపోవచ్చు. సీమాంధ్రకు జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రిని వెతుక్కోవాలి.

- oka website

cname party Votes
73876
50380
41343
PrasannaKumar Reddy Won by 23,496 Votes


ప్రతిష్టాత్మకంగా జరిగిన కోవూరు ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప టీడీపీ అభ్యర్థి ఎస్ చంద్రమోహన్ రెడ్డిపై 23,496 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నల్లపురెడ్డి విజయంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

 కోవూరు తీర్పు విశ్వసనీయతకు పట్టం: జగన్
నీతిమాలిన రాజకీయాలకు వ్యతిరేకంగానే కోవూరు ఉప ఎన్నిక తీర్పు వచ్చిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ విలువలు, విశ్వసనీయతలకు ప్రజలు పట్టం కట్టారు అని జగన్ తెలిపారు. విజయాన్ని అందించిన ప్రతి అక్కా, చెల్లి, అవ్వా, తాతకు కృతజ్ఞతలు తెలిపారు. కోవూరు ప్రజల అభిమానం, అనురాగం మరువలేనిదన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించిన విజయానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని జగన్ అన్నారు.

 మహానేతను మరువలేకపోతున్నారు: లగడపాటి
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానాన్ని ప్రజలు మరువలేకపోతున్నారని ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినందున కాంగ్రెస్ పార్టీనేతలు బాధ్యత వహించాలన్నారు. పార్టీలో నేతల మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరుకున్నందునే కాంగ్రెస్కు ఈ దుస్థితి వచ్చిందని లగడపాటి అన్నారు.

ముఖ్యమంత్రి, నాదే బాధ్యత: బొత్స
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేలవ ప్రదర్శనకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తామే బాధ్యత వహిస్తామని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. తమ రాజీనామా అంశాన్ని పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని బొత్స తెలిపారు. తాము ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు గతంలో కంటే ఎక్కువ మెజార్టీ రాలేదన్నారు. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకుపోలేదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కరెక్ట్ అని బొత్స వ్యాఖ్యానించారు. విజయాలు శాశ్వతం కాదని ఆయన అన్నారు.


ఫలితాలను సమీక్షించుకుంటాం: చంద్రబాబు
ఉప ఎన్నికల ఫలితాలపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీయార్ భ వన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో తమ పాత్ర పరిమితమైందని అన్నారు. తెలంగాణపై తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ప్రజల్ని మెప్పించలేక పోయామని బాబు అంగీకరించారు. గతంలో సాధించిన వాటి కంటే ప్రస్తుత ఫలితాలు మెరుగైనవని చంద్రబాబు సంతృప్తిని వ్యక్తం చేశారు.

From a speech given yesterday in Samrala, Panjab. I’ve not located the source on the internet, yet, but there is significant evidence, which I discuss below.  [Addendum. I've been provided the source: http://epaper.indianexpress.com/c/46596]
What I can read from the notes is: “captain amrinder singh, Ambika Soni Ji, … ndar Kaur Bhah??, rak ji, bk han prasad, Singh libra ji, sanai aur viro ki is bhumi ko me ni karti hu”. The proper one is: “Swadhinta senani aur viro ki is bhumi ko me naman karti hu” (as noted above in the image).

EVIDENCE OF THE VERACITY OF THESE “NOTES”:

a) “Clad in a salwar kameez and donning a mustard duppata“. (Tribune) The notes clearly have the salwar as background. The salwar kameez matches the picture in The Hindu.
b) “The UPA chairman was presented a siropa and a shawl by PCC chief Capt Amarinder Singh, MP Partap Bajwa and AICC incharge GS Charak.” Amarinder Singh is clearly mentioned in the notes.
c) The bodyguard depicted above matches the one in the picture here, in The Hindu.
d) I’ve cropped and turned upside down a small section of the picture of Sonia sitting on the chair. It looks like this:
This little snapshot is difficult to read but had this picture been taken with a powerful digital SLR (as it almost certainly was), then it it likely would have, if blown up, matched the image above (which shows the detailed text).
e) While Indians are smart, it is rare for a picture to be “doctored” so quickly and so genuinely. I therefore rule out doctoring of this picture. This is a genuine article. It is also very rare for someone to be smart enough to strike out words, and generally create such a powerful impression of authenticity.
Ideally I’d like to see the original high density 4-6 MB picture from which the “notes” were identified. Nevertheless:
I’m almost 99 per cent convinced about the authenticity of the above picture of Sonia Gandhi’s “notes”. 
If true, it is a sign of EXTREME SHAME for India, that we couldn’t find ONE PERSON who knows an Indian language, to govern India.
An Italian who had learnt a Indian language (and taken Indian citizenship) might have been tolerated as the head of India’s ruling party. But this is intolerable. A foreigner effectively ruling independent India.
And we have the shameful picture of a Sikh “honoring” this “Indian” foreigner with a sword. The entire Sikh religion is besmirched by such actions.

Shoot Me

http://a2.sphotos.ak.fbcdn.net/hphotos-ak-ash4/408925_285839788142107_100001482657531_808155_1346379632_n.jpg

Illusion Vs Reality:

Illusion Vs Reality:
1.Vijay Sai Reddy Revealed some incriminating evidence against Jagan:
Absolutely false. The CBI tried their level best to get VIjay Sai Reddy say what they wanted to hear. But they were not successful. He has categorically said before the judge that there is nothing more to say and also filed a similar petition. He also complained to the court that the CBI is leaking that he revealed something about Jagan and his companies regarding illegal transactions to select media. He absolutely denies all of it in his petition.
2. Narco analysis:
There is a supreme court ruling on may 5th 2010 that narco analysis is not permissible. Its a pity that our cbi JD is so unaware of that fact and still requested for it. And also Narco analysis is only allowed if the person they want to do it on gives his/her consent.
Times of India Article
3. Sunil Reddy’s arrest:
The charges are completely baseless. Today’s sakshi banner item would provide much needed fodder.
4. Jagan is next in line:
This is the famous line our enemies and yellow media love to use. Please don’t let this bother you as they have said the same thing from the time CBI investigation started. They thought the moment they get hold of documents of Jagan and his companies they would unravel everything and Jagan will be behind bars. But sadly that didn’t happen for them. They tried interrogating Vijay Sai Reddy for more than 300 hrs and tried to turn him into an approver. Having failed to do so they arrested thinking that if he is under their custody they will be able to extract something. Even there CBI failed as well. Vijay Sai Reddy has been able to successfully complete the CBI custody without turning into an approver. Now having lost the custody of Vijay Sai Reddy the CBI have almost lost hope on curtailing Jagan in assets case. In a hurry CBI has goofed up the case. Even in OMC case CBI tried a lot to name Jagan but failed miserably. That is what I can say. Having failed to extract anything from Vijay Sai Reddy anything as there was nothing the CBI has trained its guns towards Sunil Reddy. So lets hope to for the best.

In that case, where can be the real justice?

So, there are two steps left for CBI in the democratic country where the people are kings!!

CBI officers should undergo Narco Analysis test in public (or before media cameras) before handling Vijaya Sai Reddy. Who knows? CBI officers may reveal some names those are behind this entire forceful attack on Jagan and Co.
The Narco Analysis test of Vijaya Sai Reddy also should be carried in public (before media cameras)
The LIVE telecast of Narco Analysis should be announced, so that the citizens of the state can exercise their right to information with transparency.
Yes, why not? When the circus in Assembly is made LIVE on TV channels even Narco Analysis can be made LIVE.

Drama Babu

http://a3.sphotos.ak.fbcdn.net/hphotos-ak-snc7/423623_259870707418720_100001873789012_668190_1073106239_n.jpg
Flash flash flash చంద్రబాబు రైతు పోరుబాట ? ఇది రైతు పోరుబాట కాదు, బాబు గారి తొమ్మిదేళ్ళ పాలనలో ఆనాడు బషిర భాగ్ కాలుపులలో చనిపోయిన అమాయక రైతులు మరియు బాబు గారి పాలనలో రైతులు పట్టల జరిగిన ఆన్న్ నాయం, అరాచకాలకు, బలి అయి ఆత్మ హత్యలు చేసుకున్న రైతన్నల సేవాల పైన చేస్తున్న చంద్రబాబు రైతు పోరు బాట. బాబు గారు, మీకు మానవత్వం లేదా? మీరు రైతులు మధ్యకు వెళ్లి వారిని చూడగానే బషిర భాగ్ కాలుపుల ఘటన, ఆనాటి రైతన్నల ఆత్మ హత్యలు గుర్తుకు రావడం లేదా? మరచి పోయారా? మతి పోయిందా? మతి బ్రమించింద్హ? ఎంత ఆన్న్ నాయం బాబు గారు, చంద్రబాబు రైతు పోరుబాట కాదు, బాబు పొరపాటు బాట. చంద్రబాబు పనికిమాలిన రికార్దు, ఎవరు నీకు సాటి లేరాయ చంద్ర బాబు! మీ పాలనలో కొన్ని మంచు బిందువ్వులు గుర్తు చేస్తున్న, రైతులను నిలువ్వున నిర్ధకిషనయం గా, వెంటాడి మరి కాలిపించి, చంపించారు అందుకు బషిర భాగ్ కాలుపుల ఘటన నిదర్శనం కదా? మరియు కరెంటు కోతలతో రైతులను దిక్కు తోచని, దయ నీయ సిత్తి లోకి నెట్టి, వారిని ఆత్మ హత్యలకు గురి చేయలేదా? దానికి కారణం వంద శాతం మీరే కదా! స్కాం లు చాల ఉన్నాయ్, బిగ్ బి అనే స్కాం లో ఎంత అవినీతి జరిగింది? సి పి ఐ , సి పి మ్, నేతలు విడుదల చేసిన ఉమ్మడి పుస్తకావిష్కరణ బాబు ఖజానా లేదా? బాబు గారు, ఎవ్వరికైనా మనసులో ఎంతో కొంత బాద, లేక చేసిన తప్పుకు పచ్చతాపం చెందుతారు, కానీ, మీకు ఇవ్వి ఏమి పట్టలేదు అన్నట్టులు, మీరు రైతు పోరు బాట చేపట్టినారు. ఇంతకన్నా సిగ్గు మాలిన పని ఏమ్ముంది. ఈనాడు రాష్ర రైతులు చాల బాధల తో, కోలుకోలేని స్తితిలో ఉన్నారు. ఎందుకంటే, రైతులు రారాజు Dr.Y.S.RAJASEKHAR REDDY GARU రాజన్న, లేరని, అందుకే వారికీ ఇన్ని దిక్కు మాలిన పరిసిత్తులు దాప్పురించాయని కుమ్మిలిపోత్తున్నారు. ప్రతి రైతు ధైరం, మనో ధైర్యం, కొలిపోయి, దిక్కులేని స్తిత్తిలో ఉండి కూడా, రాజన్న రామ రాజ్యం కోసం ఎదురు చూస్తున్న తరుణం లో, మరల మీరు రైతు పోరుబాట అంట్టు అమాయక రైతులును మోసం చేయడానికి, రైతు పోరుబాట చేపట్టడం సమంజజసమ? నిజం గా రైతులు చాల అమ్మాయాకులు, దానినే నీవు క్యాష్ చేసుకుని, మరల రైతు పోరుబాట అనే పక్క పనికిమాలిన ముసుగులో వస్తున్నా, నీ ద్వంద నీతిని, వారు పోలుచుకోలేక పోతున్నారు. రారాజు రాజన్న మరణన్నంతరం రైతులకు జరుగుతున్నా అన్నాయం లో సోనియా కాంగ్రెస్, టి డి పి, పార్టీ లదే తప్పుడు కలయిక, తప్పుడు సంబంధం, మీరు ఇద్దరు కలసి, రైతులను మోసం చేస్తున్నారు. ఈ విషయం అమ్మయక రైతులకు తెలియదు. వారు ఎప్పటికి తెలుసుకోలేరని మీరు స్వయం గా గమనించి, రైతులను పిచ్చి వారిగా లెక్క కట్టి, మీ రాజకీయ స్వార్ధం కోసం వాడుకుంటున్నారు. కాదంటారా బాబు గారు! అనలేరు, ఎందుకంటే మీరు సోనియా కాంగ్రెస్ తో కుదుర్చుకున్న అనైతిక చీకటి ఒప్పందం అడ్డు వస్తాది. ఒక వేళ అది నిజం కాకపోతే, మీ రైతు పోరు బాట లో, వెళ్ళిన ప్రతి చోట ముందుగా రైతులు వద్ద, మీ పాలనలో వారికీ జరిగిన అన్నయాయం ప్రస్తావించి, మీ తప్పును, మీ అసమర్డ్డతను, ఒప్పుకుని, వారి కషమపణలు కొరి, తక్షణమే ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడే మీరు రైతులకు తగు నాయం చేసినట్టులు అవ్వుతాది. మీ రైతు పోరుబాటకు అర్ధం ఉంటాది. రైతన్నలరా! మీరు చుడండి, గమనించండి, మీ మధ్యలో కి వస్తున్నా, చంద్రబాబు కొత్త సీసాలో పాత సారా బాబు గారే, మరవ్వకండి, నిలబెట్టండి, నిలదీయండి, ఎందుకంటే, రైతులకు జరుగుతున్నా అన్నయాయం లో అప్పుడు, ఇప్పుడు, నార చంద్రబాబు గారే, ప్రదమ ముద్దాయి, అప్పటి పాలనలో అధికారం బాబు గారిది, ఇప్పటి పాలనలో పేరుకు మాత్రం సోనియా కాంగ్రెస్ వారిది. కానీ తెరవెనుక ముఖ్య పాత్ర నారా చంద్రబాబు గారిది. ఇద్దరు కలసి రైతుల నడ్డి విరిసి, దిక్కు లేని, బిచ్చ ఘళ్లుగా చేస్తున్నారు. johar ysr johar ysr johar ysr jai jagan jai jagan jai jagan

Fight Against VAT in Narasarao pet

http://a5.sphotos.ak.fbcdn.net/hphotos-ak-snc7/s720x720/400335_291725620885364_100001437847998_841131_1973768494_n.jpg


ప్రభం‘జనం’తో ‘పేట’ పోటెత్తింది. జనహోరు మార్మోగింది. కోలాహలం కోటప్పకొండ తిరునాళ్లను తలపించింది. జగన్నినాదం ఆ కొండ శిఖరం వరకు వినిపించింది. జననేత రాకతో పలనాటి ముఖ ద్వారం స్వాగత తోరణాలతో కళకళలాడింది. అడు గడుగునా జనం. కార్య దీక్షాదక్షుడి వెంట కదం తొక్కిన ప్రజాసందోహం! వ్యాట్ రద్దుచేయాలని కోరుతూ వస్త్రవ్యాపారుల ఆందోళనకు మద్దతుగా నరసరావుపేటలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ధర్నాకు అపూర్వ స్పందన లభించింది. మహానేత బిడ్డను చూసేందుకు వచ్చిన జనవాహినితో వీధులన్నీ కిక్కిరిశాయి. ఉవ్వెత్తున కదిలిన ప్రజలు ఓదార్పు యాత్రికుడికి సంఘీభావం తెలిపారు. పోరుకేక వినిపించిన జగన్‌తో గొంతు కలిపారు.

YSR Pic

http://a1.sphotos.ak.fbcdn.net/hphotos-ak-ash4/s720x720/426639_289254574465772_100001436964497_803997_2072313796_n.jpg

YSR Ante

http://a5.sphotos.ak.fbcdn.net/hphotos-ak-ash4/s720x720/396261_289320017792561_100001436964497_804598_1853648878_n.jpg

Cheater Babu

YS Jagan Unveiled YSR Statue at Gogulapaduరైతుల మేలు కోరని దగాకోరు సర్కారు
రైతన్నల సమస్యలపట్ల నిర్లక్ష్యంపై జగన్ ధ్వజం

* రూ. 2,400 ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని 5 నెలలు కావస్తున్నా ఒక్క పైసా ఇవ్వలేదు
* వైఎస్ హయాంలో రూ.1,200 దాకా మద్దతు ధర వచ్చింది...
* వ్యవసాయం దండగ.. తిన్నది అరగకే ఆత్మహత్యలన్న ఏకైక సీఎం చంద్రబాబు
* నా దీక్షతోనైనా రాష్ట్రానికి బుద్ధి, కేంద్రానికి మనసు రావాలని కోరుకుంటున్నా
* అశేష జన సందోహం మధ్య ముగిసిన జగన్ రైతు దీక్ష...

గుంటూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘రైతు సమస్యలను పరిష్కరించడంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మనసు ఉండడంతో మార్గం కనిపించింది. స్వర్ణయుగం లాంటి ఆయన పాలనలో క్వింటాలు ధాన్యం కనీస మద్దతు ధర రూ. 530 నుంచి రూ. 1,000 వరకు పెరిగింది. ఒక దశలో ఈ ధర రూ. 1,200 వరకు పోయింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతు సమస్యలపై మనసు లేకపోవడంతో మార్గం కనిపించడం లేదు. నిత్యం జగన్‌మోహన్‌రెడ్డిని ఏ విధంగా తొక్కాలా.. కుర్చీని ఏ విధంగా కాపాడుకోవాలా.. అనే ఆలోచన లతో కాలం గడిపేస్తున్నారు. జగన్‌పై దృష్టి పెట్టే సమయంలో కేవలం 10 శాతం ప్రజా సమస్యలపై పెడితే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. రైతులకు మద్దతు ధరకోసం నేను చేపట్టిన 48 గంటల దీక్షతో రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి, కేంద్ర ప్రభుత్వానికి మనసు రావాలని కోరుకుంటున్నా’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతు సమస్యల పరిష్కారం కోసం గుంటూరులో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష(రైతు దీక్ష) ముగింపు సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు వెంకటసుబ్బయ్య గ్లూకోజ్ కలిపిన కొబ్బరినీళ్లు ఇచ్చి జగన్‌తో దీక్ష విరమింపజేశారు. దీనికి ముందు జగన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

వైఎస్‌ఆర్ పాలన సువర్ణయుగం
48 గంటలపాటు నిరాహార దీక్ష చేస్తూ మా గోడు వినండని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చేతులు జోడించి వేడుకున్నా. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తాయని భావిస్తున్నా. రాముడి రాజ్యం చూడలేదు కానీ వైఎస్సార్ సువర్ణయుగం మనమంతా చూశాం. వరికి మద్దతు ధర వైఎస్సార్ హయాంలో రూ. 1,200 వరకు పోయిందంటే అది సువర్ణయుగాన్నే గుర్తుచేస్తుంది. ఆ ఐదేళ్ళలో పెట్టుబడిపై ఖర్చు ఒక్క రూపాయి కూడా పెరగలేదు.

రైతు ప్రభుత్వం వస్తేనే రైతు గురించి ఆలోచన చేస్తుంది. రైతు గురించి ఆలోచన చేస్తే రైతు మొహాన చిరునవ్వు ఉంటుందని నమ్మితేనే.. రాష్ట్ర ప్రభుత్వం, రైతన్న బాగుంటారు. అలా రైతు గురించి తెలిసిన వ్యక్తి, రైతు గురించి ఆలోచించిన వ్యక్తి వైఎస్సారే.. రైతు ముఖాన చిరునవ్వులు చూసిన ప్రభుత్వం వైఎస్సార్‌దే. ఆ ఐదేళ్లలో దేశం మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.5 శాతం పెరిగితే... మన రాష్ట్రంలో 6.78 శాతం పెరుగుదల నమోదైందని చెప్పడానికి నేను గర్విస్తున్నా.

ఆ ఏకైక సీఎం చంద్రబాబు
వైఎస్ సువర్ణయుగానికి ముందు ఒకాయన రాష్ట్రాన్ని పాలించాడు. ఆయన పేరు చంద్రబాబు. తొమ్మిదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన ఆయన తన హయాంలో రైతులకేం చేయలేదుగానీ... ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తూ వారి వద్దకు వెళుతున్నారు. తన హయాంలో వ్యవసాయమే శుద్ధ దండగ అని అన్నారాయన. అలా అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే.. తిన్నది అరగక చనిపోయారని అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ మాటెత్తితే.. ఆ కరెంటు ఇచ్చే తీగలలో కరెంటు ఉండదు కాబట్టి తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేశారు. అదే చంద్రబాబు ఇవాళ రోడ్డెక్కి అధికార దాహంతో ఇష్టం వచ్చినట్లు మాటలిస్తున్నారు. మొసలి కన్నీరు కారుస్తూ.. రైతుల వద్దకెళ్ళి ఆరు గంటలేం ఖర్మ.. ఏకంగా తొమ్మిది గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తామంటున్నారు.

నేను కదిలే వరకూ.. బాబు కదలరు
ఎన్నో ఏళ్లుగా రైతులు కష్టాలు పడుతుంటే.. స్పందించని చంద్రబాబుకు.. జగన్ అనే నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రోజున మెలకువ వచ్చింది. అప్పటి నుంచి ఆయనను గమనిస్తే ఏదైనా సమస్యపై ఉద్యమిస్తానని వైఎస్ జగన్ నోటి నుంచి మాట వచ్చిన వెంటనే.. నేనూ యాత్ర చేస్తా నీతోపాటు అంటాడు. నాకు నవ్వు వ స్తోంది. రైతులు పడుతున్న కష్టాల గురించి దీక్ష చేయాలనుకుంటున్నట్లు నేను ఒక పత్రికా ప్రకటన ఇచ్చిన మూడు నాలుగు గంటలకు ఆయన నిద్ర మేల్కొని రైతుల వద్దకు వచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇంతకాలం నాకైతే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసం 40 రోజులు రాత్రింబవళ్ళూ తిరుగుతున్నా. ఆయనకు ఏం పనుంది.. ఇంతకాలం ఏసీ గదుల్లో పడుకునే బదులు నేను దీక్ష చేపట్టకముందే రైతుల గురించి ఉద్యమించవచ్చు కదా! ఈ రోజు ఆ చంద్రబాబు తెలుగుదేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయ్యాయి. ప్రజలు జగన్‌వైపు పోతున్నారనుకున్న సమయంలో.. రైతులకోసం చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తూ ఉద్యమ బాట పడుతున్నారు.

ఈ సర్కారుకు సిగ్గులేదు
వైఎస్ స్వర్ణయుగం గురించి, చంద్రబాబు మొసలికన్నీరు గురించి చెప్పుకున్నాం.. ఇంకో ప్రభుత్వం ఉంది.. అది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం. మొన్న రైతు సమస్యలపై విజయవాడలో లక్షల మంది రైతులతో కలసి నేను దీక్ష చేస్తూ రూ. 4వేలు ఇన్‌పుట్ సబ్సిడీ అడిగితే రూ. 2,400 ఇవ్వడానికి అంగీకరించి దానికోసం రూ. 618కోట్లు ఇస్తామని చెప్పి ఐదు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. సిగ్గులేదీ ప్రభుత్వానికి. ఇంతేకాకుండా రైతులకు రుణ వడ్డీ మాఫీ చేస్తామన్నారు. వడ్డీ మాఫీ కావాలని అంటే రూ. 1,100 కోట్ల రుణానికి దాదాపుగా రూ. 525 కోట్లను బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించాలి. చెల్లించకపోతే అవి వడ్డీనెలా మాఫీ చేస్తాయి. ప్రభుత్వం నేటివరకు బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక రుణాల రీషెడ్యూల్ 10% కూడా చేయలేని పరిస్థితి కనపడుతోంది.

ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనొచ్చుకదా
ధాన్యం కొనుగోలు చేస్తే నిల్వ చేయడానికి స్థలం సరిపోవడంలేదని, స్థలం లేకపోతే తామిక ధాన్యం కొనలేని పరిస్థితి వస్తుందని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. తమ వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని ఎగుమతులకు అనుమతించాల్సిందిగా కేంద్రానికి సూచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 4 నెలలుగా వారు కోరుతున్నా సర్కారుకు పట్టడం లేదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా మనతో సమానంగా ధాన్యం పండిస్తున్నారు. వారికి లేని సమస్య మనకెందుకు వస్తుందని నేను అడుగుతున్నా. పంజాబ్‌లో పండించిన ధాన్యంలో 94.2 శాతాన్ని సివిల్ సప్లరుుస్, కోఆపరేటివ్ సంస్థ, స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి విక్రయిస్తుంది. ఈ ప్రయత్నం మనరాష్ట్రంలో ఎందుకు జరగడం లేదు? అసలు ఎగుమతులను రాష్ట్రప్రభుత్వమే ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తున్నా.

మద్దతు ధర 100 పెంచాలి
ఓ రకంగా చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు ఇస్తానన్న మద్దతు ధర రూ. 1000 కూడా సరిపోదు.. దాన్ని కచ్చితంగా 100 రూపాయలైనా పెంచి రూ.1100 చేయాలని నేను కోరుతున్నా. అంతేకాదు ఖరీఫ్‌లో ధాన్యానికి క్వింటాల్‌కు కేంద్ర ధరల నిర్ణాయక కమిటీ రూ.167 పెంచుతూ సిఫార్సు చేసింది. రబీలో పండిన పంటకు కూడా దీనిని వర్తింపజేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.

స్వర్ణయుగం మనమే తెచ్చుకుందాం
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి రెండు సంవత్సరాలు కావస్తోంది. ఆయనలా.. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని, తనపేరు వాళ్ళ గుండెల్లో, హృదయాల్లో కొలువుండాలని, చనిపోయిన తరువాత వారి గుండెల్లో నిలిచిపోవాలని, తన ఫొటో వారి ఇళ్లలో ఉండాలని.. అంతగా ప్రతి పేదవాడికి దగ్గరగా ఉండాలనే తపన ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికీ లేదు. రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. ప్రతి రైతు, ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వును చూసిన.. వైఎస్ స్వర్ణయుగాన్ని మనమే తెచ్చుకుందాం.

పెట్రో ధరలతో దొంగ దెబ్బ తీశారు: ఐదు రాష్ట్రాలలో ఎన్నికల అనంతరం పెట్రోలుపై రూ.5 వాత వేసి ప్రభుత్వం ప్రజలను దొంగదెబ్బ తీసింది. సంవత్సరానికి ఎనిమిది సార్లు రేట్లు పెంచి రూ.15 మేర భారం వేసింది. ఇది సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నా? ఇది రైతుల గురించి చేపట్టిన దీక్ష కాబట్టి.. ఈ విషయంపై ఇంతకుమించి ఇక్కడ మాట్లాడను.* అన్నదాతకు మద్దతుగా48 గంటలు నిరసన
* 13 ఎకరాల్లో ‘వైఎస్సార్ రైతు ప్రాంగణం’
* దీక్షా ప్రాంగణంలో లక్షన్నర మంది రైతులు
* కూర్చునేందుకు వీలుగా పందిళ్లు
* ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు
* ఒంగోలు నుంచి రోడ్డు మార్గంలో గుంటూరుకు జగన్
* 15 కిలోమీటర్ల మేర భారీగా స్వాగత ఫ్లెక్సీల ఏర్పాట్లు

గుంటూరు, న్యూస్‌లైన్: కనీస మద్దతు ధర అందక విలవిల్లాడుతున్న అన్నదాతకు అండగా కడప ఎంపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ‘రైతు దీక్ష’ ప్రారంభించనున్నారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు వెన్నుదన్నుగా నిలవని సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆయన 48 గంటలపాటు మెతుకు ముట్టకుండా నిరసన తెలపనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు గుంటూరులో ఆయన దీక్ష ప్రారంభిస్తారు. ఈ దీక్ష కోసం నల్లపాడు రోడ్డులో ఎంపిక చేసిన 13 ఎకరాల ప్రైవేటు స్థలానికి ‘వైఎస్‌ఆర్ రైతు ప్రాంగణం’గా నామకరణం చేశారు. 40 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో వేదికను నిర్మించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దీక్షా ప్రాంగణంలో భారీగా ఏర్పాట్లు చేశారు. లక్షన్నర మంది రైతులు కూర్చునేందుకు వీలుగా చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు.

పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు
దీక్షా శిబిరానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. గుంటూరు మార్కెట్ యార్డు ప్రాంగణం, రెడ్డి కళాశాల ప్రాంగణం, దీక్షాశిబిరం వెనుక వైపు ఉన్న ఆదర్శనగర్ ఖాళీ స్థలాలను ప్రస్తుతానికి పార్కింగ్ కోసం గుర్తించారు. వాహనాల రద్దీని బట్టి మరోనాలుగు పార్కింగ్ ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి సిద్ధంగా ఉంచారు. కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు బస్టాండ్ సమీపంలో, చుట్టుగుంట సెంటర్‌లో; ప్రకాశం జిల్లా నుంచి వచ్చే వాహనాలకు ఐదో నెంబరు జాతీయ రహదారి సమీపంలో రెండు పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసినట్లు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పార్టీ నేత లేళ్ళ అప్పిరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దీక్షా శిబిరాన్ని శనివారం పార్టీ నేతలు భూమన కరుణాకరరెడ్డి, అంబటి రాంబాబు, అప్పిరెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి తదితరులు పరిశీలించారు.

రోడ్డు మార్గాన జగన్
జగన్ ఒంగోలు నుంచి ఆదివారం ఉదయం రోడ్డు మార్గాన బయలుదేరి మార్టూరు, చిలకలూరిపేట, యడ్లపాడు మీదుగా దీక్షా శిబిరానికి చేరుకుంటారు. కడప ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో ఘనవిజయం సాధించి మొదటిసారిగా ఆయన జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఘనస్వాగతం పలకటానికి పార్టీ కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగర సరిహద్దుల నుంచి దీక్షా ప్రాంగణం వరకు, అన్ని ప్రధాన రహదారులు కలుపుకొని సుమారు 15 కిలోమీటర్ల మేరకు భారీగా ఫ్లెక్సీలతో అలంకరించారు.

అన్నదాతల తరఫున జగన్ ప్రధాన డిమాండ్లు ఇవీ..
* ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు, రైతులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం తక్షణమే రూ. 1,000 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. పౌరసరఫరాల శాఖ, స్వయం సహాయక గ్రూపులు కొనుగోళ్లు జరపడానికి.. ఈ ఫండ్‌లోంచి డబ్బులు మంజూరు చేయాలి.
* పౌరసరఫరాల శాఖ కొనుగోళ్లు వేగవంతం చేసేలా ఆదేశాలు జారీచేయాలి.
* ధాన్యం కొనుగోళ్లలో స్వయం సహాయక బృందాలకు తక్షణం గోనె సంచులను ఏర్పాటు చేయాలి. స్వయం సహాయక బృందాలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలి.
* క్వింటాలుకు రూ. 100 బోనస్ ధర ప్రకటించాలి.
* యార్డులలో రైతులు వారాల తరబడి ఎదురుచూసే పరిస్థితి ఉండకుండా చర్యలు తీసుకోవాలి. ఏరోజుకారోజు ధాన్యం కొనుగోళ్లు ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీచేయాలి.
* దళారులు మోసాలకు పాల్పడితే, అలాగే ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించకపోతే అలాంటివారిపై తహశీల్దార్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీచేయాలి. మోసపోయిన రైతులు ఫిర్యాదులు చేసిన తక్షణం దళారులపై కేసులు నమోదు చేసి రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు
ఒంగోలు, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు దారా సాంబయ్య, పాలపర్తి డేవిడ్ రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఒంగోలు వచ్చిన వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. టీడీపీ నాయకుడు చేగిరెడ్డి లింగారెడ్డి కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.

‘రైతుదీక్ష’లో తికాయత్ మృతికి నివాళులు


గుంటూరు: రైతు నాయకుడు తికాయత్ మృతికి వైఎస్ జగన్ ఘనంగా నివాళులు అర్పించారు. రైతుదీక్షా శిబిరం వేదిక మీద లక్షలాది మంది రైతులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించి రైతు బాంధవుని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం కోసం తికాయత్ జరిపిన ఉద్యమాల గురించి వేదికపై మాట్లాడారు. మూడు నెలల క్రితం చెరకు పంటకు మద్దతు ధర కోరుతూ మూడులక్షల మంది రైతులతో ఢిల్లీని ముట్టడించిన తికాయత్, తన జీవితంలో ఎన్నో ఉద్యమాలకు సారథ్యం వహించారని సంతాప సందేశంలో పేర్కొన్నారు. రైతు ఉద్యమ నాయకుడు, జాతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు తికాయత్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఉత్తరప్రదేశ్‌లో ఈ ఉదయం మృతిచెందారు.


భావి ముఖ్యమంత్రి జగన్: రెహమాన్


వరంగల్: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ వ్యాఖ్యానించారు. అశేష ప్రజాభిమానాన్ని చూరగొన్న జగన్ భావి ముఖ్యమంత్రి కాగలరని అభిలషించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు వాస్తవంగా రైతులంటే అభిమానం లేదని, జగన్మోహన్ రెడ్డిలో మాత్రం రైతుల పట్ల ఆచరణయోగ్యమైన అభిమానం కనిపిస్తోందని ‘రైతుదీక్ష’ వేదికమీద మాట్లాడుతూ అన్నారు.

‘సర్కార్‌పై వ్యతిరేకతతో జగన్‌కు మెజార్టీ’


నెల్లూరు : పభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భారీ మెజార్టీ వచ్చిందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన ఆదివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ యూపీఏ సర్కార్ పెట్రో ధరల పెంపు నిర్ణయాన్ని ఎన్నికల ముందు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేతగానితనం కనపడుతోందని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.


దీక్షాశిబిరానికి లక్షలాది మంది రైతులు


గుంటూరు: రైతుల సమస్యల పరిష్కారం కోసం జగన్ తలపెట్టిన దీక్షకు ఊరూవాడా ఏకమై కదులుతున్నాయి. లెక్కకు మిక్కిలిగా కర్షకులు కంకణబద్దులై దీక్షాశిబిరానికి తరలుతున్నారు. గుంటూరు నగరాన్ని అనుసంధానిస్తూ వున్న అన్ని రహదారులు లక్షలాది మంది రైతన్నల రాకతో జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. గుంటూరుతో సహా అనేక జిల్లాల నుంచి నాయకులు సైతం వేలాది రైతులతో కూడి రణరంగానికి బయలుదేరే యోధులవలె ఉద్వేగంతో కదిలి వస్తున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పున్నారెడ్డి ఐదువేల మంది రైతులతో కలిసి దీక్షాస్థలికి సమూహంగా బయలుదేరారు. అలాగే మరికొంత మంది నేతలు రైతులను క్రోడీకరించి గుంటూరు వేపు కదులుతున్నారు.

* మాజీ ఎమ్మెల్యే పున్నారెడ్డి మాచర్ల నుంచి ఐదువేల మందితో దీక్షాస్థలికి రాక
*ఆళ్ళరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరి, సత్తెనపల్లి నుంచి వందలాది వాహనాల్లో జగన్‌దీక్షకు బయలుదేరిన రైతులు
*గురజాల ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 150 వాహనాల్లో బయల్దేరిన రైతన్నలు, కార్యకర్తలు
*తాడికండ, తుళ్ళూరు మండలాల నుంచి భారీగా తరలివస్తున్నరైతులు
*పెదకూరపాడు నియోజకవర్గం నుంచి రత్నబాబు, గుత్తికొండ అంజిరెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివెళుతున్న రైతులు
*అనంతపురం నుంచి ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాక


చిలకలూరిపేటలో రైతుల జగన్నినాదం


గుంటూరు: రైతుదీక్షా ప్రాంగణానికి చేరుకునేందుకు ఒంగోలు నుంచి బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చిలకలూరిపేటలో చిక్కుకుపోయారు. యువనేతను కలిసేందుకు, చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన వేలాది మంది రైతులతో రహదారులన్నీ ఇసుకవేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. రైతులతో పాటు పెద్ద ఎత్తున అభిమాన యువత, కార్యకర్తలు అడుగడుగునా కాన్వాయ్‌కి అడ్డం పడుతూ వుండడంతో జగన్మోహన్ రెడ్డి ప్రయాణం సాగడం కష్టసాధ్యంగా మారింది. ఇప్పటికే ఒంగోలు నుంచి వస్తుండగా మార్గమధ్యంలో అనేకచోట్ల అభిమానులు, ప్రజలు ఆపడంతో యువనేత ప్రయాణం రెండు గంటలు ఆలస్యంగా సాగుతోంది. చిలకలూరి పేట రహదారులన్నీ జగన్ అనుకూల నినాదాలు, వైఎస్సార్ పార్టీ జెండాల రెపరెపలతో కిటకిటలాడుతున్నాయి.గుంటూరు: రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మారెప్ప, వెంకట రమణ, అంబటి రాంబాబుతో పాటు ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, పుల్లా పద్మావతి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ పాల్గొన్నారు.

'పులివెందుల' దక్కుతుందనుకున్నాం..
వివేకాతో సీఎం కిరణ్

హైదరాబాద్, మే 14 : కడప ఉప ఎన్నికల్లో పులివెందుల స్థానం కాంగ్రెస్‌కు దక్కుతుందని, కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనుకున్నామని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డితో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీఎంను క్యాంపు కార్యాలయంలో వివేకా, ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి శనివారం కలిశారు. ప్రజలు తెలివైన వారని.. ఎన్నికల సమయంలో ఒకటి చెప్పారని.. ఓట్లు వేసే సమయంలో వారనుకున్నట్లుగా వేశారని కిరణ్ అన్నారు.

క్యాంపు కార్యాలయంలో సీఎంను మంత్రి అనం రామనారాయణరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే కమ్మలమ్మ కలిశారు. ఈ భేటీ అనంతరం ఆనం మాట్లాడుతూ.. కడప ఎన్నికల్లో పూర్తిగా సానుభూతి పవనాలు కన్పించాయన్నారు. ఈ ఫలితాల వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. జగన్ ధన ప్రభావం వల్లే ఈ ఎన్నికల్లో గెలిచారని కమలమ్మ వ్యాఖ్యానించారు. కాగా.. మంత్రి పితాని సత్యనారాయణ కూడా సీఎంను కలిశారు.


జగన్ పద్మవ్యూహంలో నుంచి వస్తారు: మోహన్‌బాబు

హైదరాబాద్, మే 14 :'భారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్లి బయటకు రావడం తెలియక ఇరుక్కు పోయాడు... కానీ నా మేనల్లుడు జగన్‌కి లోపలికి వెళ్లడమూ తెలుసూ, బయటకు రావడమూ తెలుసు...' అని ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మోహన్‌బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోనే రెండవ అత్యధిక మెజారిటీతో కడప లోక్‌సభ స్థానం నుంచి జగన్, భారీ మెజారిటీతో చెల్లెమ్మ విజయమ్మ పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందడం... అంటే రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ చేసిన మంచి పనులకు ప్రజలపట్టాభిషేకం అని అన్నారు.


ప్రజల తీర్పే అంతిమం: రాజశేఖర్

హైదరాబాద్, మే 14 : 'కడప, పులివెందుల ప్రజలు నీపై(జగన్), విజయమ్మపై ఎంతో నమ్మకం ఉంచి గెలిపించారు... వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి' అని జగన్‌కు ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ సూచించారు. ప్రజల తీర్పే అంతిమమన్నారు.